ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రేండింగ్ లో 'కోర్టు' లోని ప్రేమలో సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 07:23 PM

నేచురల్ స్టార్ నాని కోర్టు పేరుతో ఒక చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్ ని ప్రేమలో అనే టైటిల్ తో వాలెంటైన్ డే సందర్భంగా విడుదల చేసారు. ఈ ఓదార్పు మోలిడీని విజయ్ బుల్గాన్ స్వరపరిచారు. ఒక అందమైన బీచ్ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి మరియు సమీరా భరత్త్వాజ్ అద్భుతంగా పాడారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. స్టేట్ vs నో బాడీ ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హర్ష రోషన్ మరియు శ్రీదేవి ఈ సినిమాలో జంటగా చూడబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడు కాగా, దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీని, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మార్చి 14న స్క్రీన్‌లను తాకడానికి ఈ చిత్రం సిద్ధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa