ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దండుపాళ్యం 4'..ఈ సారి ఇంకా ఆసక్తిగా....

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 12:52 PM

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా  తో   సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ…సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా  సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ…దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.
నటీ నటులు :సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్  సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa