ఆదిత్య ఓం నటించిన 'బందీ' చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో, సందేశాత్మకంగా తెరకెక్కిన తొలి చిత్రం తమదేనని దర్శకుడు రఘు తిరుమల చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్ పై నిర్మించారు. ఇందులో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోందని, భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతాలలో రియల్ లొకేషన్స్ మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకులు తెలిపారు. పర్యావరణ ప్రేమికులను కదిలించేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన హామీ ఇస్తున్నారు. 'బందీ' చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల తెలిపారు. తొలుత పరిమితమైన స్క్రీన్స్ లోనే దీనిని విడుదల చేసి, ఆ తర్వాత ప్రేక్షకుల స్పందన బట్టి థియేటర్ల సంఖ్య పెంచుతామని అన్నారు. ఈ సినిమాను ఎన్జీఓస్ తోనూ, సామాజిక సంస్థలతోనూ కలిసి ప్రమోట్ చేసే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa