నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం 'లెవెన్'. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఈ సినిమాను అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలైంది. అలానే ఈ సినిమా కోసం శ్రుతీ హాసన్ పాడిన 'ది డెవిల్ ఈజ్ వెయింటిగ్' సాంగ్ నూ మేకర్స్ రిలీజ్ చేయగా, దానికి మంచి ఆదరణ లభించింది. దాంతో ఇప్పుడు మరో పాటను ఈ చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేశారు. విశేషం ఏమంటే... ఈ పాటను ఆండ్రియా జెరెమియా పాడటమే కాదు.. పెర్ఫార్మ్ చేశారు. ఆండ్రియా డాన్స్ మూమెంట్స్ ఖచ్చితంగా కుర్రకారుని ఆకట్టుకుంటాయని వారు చెబుతున్నారు. డి ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. తాజాగా విడుదలైన 'ఇక్కడ రా...' అనే పాటను రాకేందు మౌళి రాశారు. ఈ సినిమాలో అభిరామి, దిలీపన్, రిత్విక ఇతర కీలక పాత్రలను పోషించారు. సమ్మర్ స్పెషల్ గా 'లెవన్' మూవీని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa