బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భైరవం’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కథానాయికలు. ‘భైరవం’ థీమ్ సాంగ్‌ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ‘భం భం భం శివ...’ అంటూ చైతన్య ప్రసాద్ సాహిత్యం, శివుని దైవిక సారాన్ని అందంగా ఆవిష్కరించింది. ఈ పాటకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా శంకర్ మహాదేవన్ అద్భుతంగా ఆలపించారు. బెల్లకొండ శ్రీనివాస్ పాత్ర శివ తాండవం స్ఫూర్తితో సమ్మోహన పరుస్తుంది. ఒక ఆలయం ముందు చిత్రీకరించిన సన్నివేశాలు పాటకు ఆధ్యాత్మికతను జోడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa