ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమన్నా 'ఓదెల-2' టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 02:05 PM

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ఓదెల-2 టీజ‌ర్‌ను మేకర్స్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో విడుద‌ల చేశారు. 2021లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంపత్‌ నంది క‌థ‌ను అందిస్తుండ‌గా.. అశోక్‌ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో త‌మన్నా ఒక నాగ సాధువు పాత్రలో కనిపించనుంది.క‌రోనా టైమ్‌లో ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఓదెల 2 పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa