ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాంటిక్‌గా ఉండేందుకు వ‌య‌సుతో ప‌ని లేదు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 05:53 PM

న‌టుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌..ర‌ష్మిక న‌టిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ చిత్రానికి భరత్‌ కమ్మ దర్శకుడు. ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని విలేకరి ప్రశ్నించారు. దీనికి కన్నడ భామ స్పందిస్తూ.. ‘అతడు తన భావాల్ని, ఇష్టాల్ని వ్యక్తపరిచే వ్యక్తి అయినా, కాకపోయినా ఫర్వాలేదు. కానీ నిజాయతీగా ఉండాలి. అతడి ప్రవర్తన నాకు నచ్చాలి. అన్నింటికన్నా మించి అతడిది మంచి మనస్సై ఉండాలి. అతడితో చాలా సమయం గడపాలని నాకు అనిపించాలి. నా దృష్టిలో రొమాంటిక్‌గా ఉండేందుకు వయసుతో పనిలేద‌ని తెలిపింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa