దండుపాళ్యం సినిమా ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే మూడు భాగాలు వచ్చిన ఈ సినిమా నాలుగో భాగం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. దండుపాళ్యం 4గా వస్తున్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. కాగా, ఈ చిత్రం విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న తేదీకి కచ్చితంగా చిత్రాన్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు కేటీ నాయక్, వెంకట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దండుపాళ్యం 4లో అనేక ఆసక్తికరమైన అంశాలు వున్నాయని తెలిపారు. ఇప్పటికే విడుదలై విజయం సాధించిన ‘దండుపాళ్యం’ మూడు భాగాలకు ఈ సినిమా సీక్వెల్ కాదని చెప్పారు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు చేసింది.. పోలీస్ స్టేషన్‌లో దొంగల పట్ల పోలీసుల తీరు.. వంటి అంశాలు ఈ చిత్రంలో వుంటాయని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందని తెలిపారు. బెనర్జీ, ముమైత్ ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించారని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa