ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కినేని అఖిల్ సరసన కొత్త హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 06:20 PM

మంచి కథను సెట్ చేసుకుని అఖిల్ తో ఒక సినిమా చేయడానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ రంగంలోకి దిగాడు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకున్న విభిన్నమైన ప్రేమకథ ఇది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది.


ఈ సినిమా కోసం చాలామంది కొత్త కథానాయికల పేర్లను పరిశీలించారు. తాము అనుకున్న స్థాయి హీరోయిన్ కోసం అన్వేషిస్తూనే, అఖిల్ తదితరులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. రెండవ షెడ్యూల్ షూటింగుకి సమయం దగ్గర పడుతుండటంతో, కొత్త అమ్మాయిని కథానాయికగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మంచి ముహూర్తం చూసుకుని ఆమె పేరును ప్రకటించాలనే ప్లాన్ చేసినట్టుగా సమాచారం. అఖిల్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన ఆ అమ్మాయి ఎవరో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa