ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సస్పెన్స్ థ్రిల్లర్ గా 'W/O ఆనిర్వేశ్'

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 07:09 PM

రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ నటించిన సినిమా 'W/O ఆనిర్వేశ్'. గంగా సప్త శిఖర దర్శకత్వంలో గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో శివాజీ ఈ చిత్రం ట్రైలర్ ను  విడుదల చేశారు.ట్రైలర్ చూశాక  రాంప్రసాద్ విభిన్నమైనటువంటి పాత్రలో నటించి కామెడీకి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్ లో ఈ చిత్రం ఉన్నట్టు ట్రైలర్ ద్వారా అనిపిస్తుందని, కచ్చితంగా మంచి హిట్ అవుతుందని  దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు హీరో శివాజీ. దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ "జబర్దస్త్ రాంప్రసాద్ వంటి వ్యక్తితో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం చాలెంజింగ్ గా అనిపించిందని, ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ వి ఆర్ కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ అని అన్నారు. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ " సినిమా అద్భుతంగా వచ్చింది   మార్చి ఏడో తారీఖున ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతుంది" అని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa