ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. ఈ సారి ఆస్కార్ అవార్డులు ఎవరు సొంతం చేసుకున్నారు? ఏ ఏ మూవీకి వచ్చాయో తెలిపోయింది. సామాజిక సంబంధాలు, దేశాల మధ్య సంబంధాలు, సామాజిక అసమానతలకు పెద్ద పీట వేసింది ఆస్కార్ జ్యూరీ. ఈ క్రమంలో ఆస్కార్ బెస్ట్ మూవీగా `అనోరా` ఆస్కార్ సొంతం చేసుకోగా, యాడ్రియన్ బ్రాడీ(ది బ్రూటలిస్ట్) ఉత్తమ నటుడిగా ఆస్కార్ దక్కించుకున్నారు.`అనోరా` నటి మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా ఆస్కార్ సాధించింది. బెస్ట్ డైరెక్టర్‌గా `అనోరా` ఫేమ్ సీన్ బేకర్ ఆస్కార్ ని గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఓరిజినల్ స్కోర్ విభాగంలో, ఎడిటింగ్‌లో సీన్ బేకర్ మరో రెండు ఆస్కార్ సాధించారు. మొత్తంగా `అనోరా` మూవీ ఆస్కార్‌లో సంచలనంగా సృష్టించింది. సీన్ బేకర్ ఒక్కరే నాలుగు అవార్డులను(బెస్ట్ ఫిల్మ్ తో కలిపి) సొంతం చేసుకోవడం విశేషం. దీంతోపాటు వరల్డ్ మోస్ట్ పాపులర్ మూవీ `డ్యూన్2`కి రెండు ఆస్కార్ లు దక్కాయి. మరోవైపు `ది బ్యూటలిస్ట్` మూవీకి మూడు ఆస్కార్లు వరించాయి. ఈ మూడు సినిమాల హవా ఆస్కార్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.ఇక సందేశం పరంగా, సామాజిక సమస్య పరంగా, ప్రపంచ యుద్ధం ఎంత ప్రమాదమో చెబుతూ రూపొందించిన `నో అదర్ ల్యాండ్` డాక్యుమెంటరీ ఫీచర ఫిల్మ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇందులో దర్శకులు మాట్లాడిన మాటలు ఆలోచింప చేస్తున్నాయి. అందరి హృదయాలను కొల్లగొడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa