జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్ 2’. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా అయన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ సూపర్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య మూవీ మేకర్స్ ఓ సాంగ్‌ను ప్లాన్ చేశారట. 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉండబోతుందట. పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్ర్లను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఈ డ్యాన్స్‌లో మునుపెన్నడూ చూడని విధంగా ఓ సరికొత్త పాటని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. యష్‌రాజ్ స్టూడియోలో ప్రస్తుతం ఈ డ్యాన్స్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. అంతే కాదు ప్రీతమ్ మ్యూజిక్ లో రానున్న ఈ సాంగ్‌ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడట. ఇందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ అద్భుతమైన సెట్ కూడా నిర్మించారని, ప్రీతమ్ చాలా ఫాస్ట్ బీట్తో సాగే పాటను కంపోజ్ చేశారని బాలీవుడ్ టాక్. ఇక ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ.. 500 మంది డ్యాన్సర్లతో హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే థియేటర్‌లు ఏ రేంజ్‌లో ఊగిపోతాయో ఊహించుకోండి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa