టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ కాంబోలో రాబోతున్న మల్టీస్టారర్ మూవీ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'వార్-2' సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, 'వార్-2'కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానుల ఆనందానికి కారణం అవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఓ క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇక ఈ పాటలో ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు కూడా చిందులేయనున్న టు టాక్. రెగ్యులర్ డ్యాన్స్ కాకుండా స్పెషల్‌గా ఉండేలా యష్‌రాజ్ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో షూట్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు షేక్ అవడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa