బ్రహ్మాజీ మరియూ ఆమని ప్రధానమైన పాత్రలను పోషించిన 'బాపు' సినిమా, ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాజు - భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి 'దయ' దర్శకత్వం వహించాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
మల్లన్న తండ్రి రాజయ్య (సుధాకర్ రెడ్డి) ఆ కుటుంబానికి పెద్ద తలకాయ. ఆయన ఇచ్చిన ఒక ఎకరం పొలమే మల్లన్నకు ఆధారం. ఊళ్లో అప్పుల కారణంగా మల్లన్న ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతని తండ్రి రాజయ్యను చంపేసి సహజ మరణంగా చూపించగలిగితే, సర్కారు వారి నుంచి 5 లక్షలు వస్తాయని మల్లన్నతో సరోజ చెబుతుంది. దాంతో అతను ఆలోచనలో పడతాడు. అదే ఊళ్లో లచ్చవ్వ (గంగవ్వ) కొడుకు చంటి (రచ్చరవి) జేసీబీ ఆపరేటర్ గా ఉంటాడు. అతను ఒకరోజున జేసీబీతో పనిచేస్తూ ఉండగా, పురాతన కాలం నాటి ఒక బంగారు విగ్రహం బయటపడుతుంది. చంటి మూడో కంటికి తెలియకుండా దానిని తీసుకొచ్చి పెట్టెలో భద్రపరుస్తాడు. అయితే అలాంటి వాటి వలన కలిసిరాదని నమ్మిన లచ్చవ్వ, ఆ విగ్రహాన్ని ఒక బావిలో పడేస్తుంది. ఆ బావిని పూడిక తీసినప్పుడు ఆ విగ్రహం రాజయ్యకి దొరుకుతుంది. అయితే మతిమరుపుతో బాధపడుతున్న రాజయ్య ఆ విగ్రహాన్ని ఎక్కడ దాచింది మరిచిపోతాడు. ఈ విషయం తెలియని మల్లన్న దంపతులు రాజయ్యను చంపాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఆ బంగారు విగ్రహం ఎవరి సొంతమవుతుంది? వరలక్ష్మి వివాహం రవితో జరుగుతుందా? అనేది కథ.
దర్శకుడు ఈ కథను చెప్పడానికి ఎంచుకున్న విలేజ్ బాగుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన బ్రహ్మాజీ .. ఆమని .. సుధాకర్ రెడ్డి .. రచ్చ రవి అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. వాసు పెండెం ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆహ్లాదకరమైన పల్లె అందాలను ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. అనిల్ ఆలయం ఎడిటింగ్ ఓకే.
Aaand they’re hereee #BaapuonJioHotstar Streaming Now only on #JioHotstar
Watch Now - https://t.co/iToJ9KemZD @actorbrahmaji @DhanyaBee @Sri_Avasarala @dayakar_daya @MadhuraAudio @comrade_film_factory @mani_aegurla @rrdhru1 @abitha_venkat @vasupendem @aalayamanil… pic.twitter.com/hSgnjlsSUj
— JioHotstar Telugu (@JioHotstarTel_) March 7, 2025
![]() |
![]() |