వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రియదర్శి నటించిన తాజా చిత్రం ‘కోర్ట్’. ‘ఏ స్టేట్ వర్సెస్ నోబడీ’ ఉపశీర్షిక. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నాని సమర్పిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ నెల 14న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ‘‘ప్రేక్షకులకు కొత్తదనం అందించే మంచి సినిమా చేయాలని ఎదురుచూసే సమయంలో దర్శకుడు రామ్ ఈ కథను చెప్పారు. సినిమాలో నా పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేశాను. ఈ సినిమాతో లాయర్లపై మరింత గౌరవం పెరిగింది. చాలా నిజాయితీతో చేసిన ప్రయత్నం ఈ సినిమా. దర్శకుడు రామ్ చాలా ప్రతిభావంతుడు. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని సహజంగా మలిచారు. నానిగారికి ఈ సినిమా కథపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన నటించే సినిమా కన్నా ఈ సినిమా విషయంలోనే ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు. ఈ ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. అందరికి గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa