ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 21న విడుదల కానున్న 'సస్పెక్ట్‌’

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 12:05 PM

రుషి కిరణ్‌, శ్వేత, రూప, శివ యాదవ్‌, రజిత కీలక పాత్రలు పోషించిన 'సస్పెక్ట్‌’ చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు విఎన్‌ ఆదిత్య  చేతుల  రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ుూఅద్భుతమైనటువంటి స్ర్కీన్‌ప్లేతో క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు. రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టెంపుల్‌ టౌన్‌ టాకీస్‌ బ్యానర్‌పై కిరణ్‌ కుమార్‌ నిర్మించారు.ఒక క్రైమ్‌ ఇష్యూని ప్రత్యేక పరిశోధనా బృందం ఎలా ఛేదించింది అన్న కథతో దర్శకుడు ఎంతో ఉత్కంఠగా తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. ఎస్‌కెఎమ్‌ఎల్‌ మోషన్‌ పిక్చర్స్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మార్చి 21న విడుదల చేయబోతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa