1990లలో మాస్ యాక్షన్ హీరోగా ' పార్తీబన్' తన జోరు చూపించారు. ఆ తరువాత కాలంలో ఆయన దర్శక నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. " భాగ్యరాజా గారి దగ్గర నేను అసిస్టెంట్ గా చేరాను. అలా సినిమాకి సంబంధించిన నా ప్రయాణం మొదలైంది. ఆ తరువాత కొంతకాలానికి దర్శకుడిగా మారాను" అని అన్నారు."నా దర్శకత్వంలో చేయడానికి హీరోలు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితులలో నేనే హీరోగా మారాను. ఆ సినిమాలో సీత నటించారు. అప్పటికే ఆమె హీరోయిన్ గా 50 సినిమాలు చేశారు. ఆ సినిమా సమయంలోనే మేము ప్రేమించుకోవడం .. పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. నేను సీతగారిని ప్రేమించడం పెద్ద విషయం కాదు. కానీ ఆమె నన్ను ఇష్టపడటం గొప్ప విషయమని నేను చెబుతూ ఉంటాను. పెళ్లైన పదేళ్ల తరువాత తాము విడిపోయామని అన్నారు. " భార్యాభర్తలు విడిపోతే కారణం ఏమిటనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. నాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ. మేమిద్దరం కలిసున్న ఇంటికి ఆ తరువాత నేను వెళ్లలేదు. మరో సొంత ఇంటిని కొనే ఆలోచన కూడా చేయలేదు. తను మళ్లీ పెళ్లి చేసుకోవడం తన వ్యక్తిగత విషయం .. ఆ విషయంపై నేను మాట్లాడకూడదు. ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాను. ఒక మంచి హస్బెండ్ గా ఉండలేకపోయినా, ఒక మంచి ఫాదర్ ను అనిపించుకున్నందుకు హ్యాపీగా ఉంది" అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa