ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ లేడీ సూపర్ స్టార్ తరువాత 'సమంత' నే.....

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 12:32 PM

కొంతకాలం క్రితం వరకూ హీరోతో కలిసి ఆడిపాడే పాత్రలను మాత్రమే చేసిన సమంత, ఈ మధ్య కాలంలో నటనకి ప్రాధాన్యత ఎక్కువగా వున్న పాత్రలను చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన 'యూ టర్న్' .. 'ఓ బేబీ' భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.దాంతో 'ఓ బేబీ'కి ముందు 2 కోట్ల పారితోషికాన్ని తీసుకున్న సమంత, తన పారితోషికాన్ని కోటి రూపాయల వరకూ పెంచేసినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. అంటే ఇక నుంచి సమంత ఒక సినిమాకి 3 కోట్లు అందుకోనుందన్న మాట. ఈ పారితోషికంతో సమంత సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న రెండవ నాయికగా పేరు తెచ్చుకుంది. సినిమాకి 5 కోట్ల పారితోషికం అందుకుంటూ తొలిస్థానంలో నయనతార వుంది. ఆమె కూడా నాయికా ప్రాధాన్యత కలిగిన చిత్రాలతోనే ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa