ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రంగస్థలం' విషయంలో ఫీల్ అవుతున్న అనుపమ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 02:35 PM

అనుపమా పరమేశ్వరన్ తాజా చిత్రంగా 'రాక్షసుడు' త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలో ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోన్న అనుపమ, 'రంగస్థలం' సినిమాను గురించి ప్రస్తావించింది.


ఈ సినిమాలో 'రామలక్ష్మి' పాత్ర కోసం ముందుగా నన్ను అడిగారు. అయితే అప్పుడు నాకు వున్న కమిట్మెంట్స్ కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మీ అందరికీ తెలిసిందే. అంతటి హిట్ సినిమాను వదులుకోవలసి వచ్చినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతూనే వున్నాను. అయితే 'రామలక్ష్మి' పాత్రను సమంత చాలా గొప్పగా చేసింది. ఒకవేళ ఆ పాత్రను నేను చేసుంటే, అంత గొప్పగా చేసేదానిని కాదేమోనని అనిపిస్తూ ఉంటుంది. నాకంటే ఆ పాత్రకి సమంతనే కరెక్ట్ అనుకుంటూ వుంటాను" అని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa