ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డియర్ కామ్రేడ్' నైజాం వసూళ్లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2019, 12:38 PM

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ఈ నెల 26వ తేదీన 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.


ఇక నైజామ్ లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందన్న తెలిసిందే. తొలి మూడు రోజుల్లో ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 5.68 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక తెలంగాణలో ఈ రోజు కూడా బోనాల పండుగ సందర్భంగా సెలవు కావడంతో, ఈ రోజున కూడా మంచి వసూళ్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను విడుదలైన ఈ సినిమాను, హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa