ఇంద్రజ, అజయ్ , జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'సీఎం పెళ్లాం'. ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం రమణా రెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో "సీఎం పెళ్లాం" సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ "సీఎం పెళ్లాం సినిమా ఒక మంచి సోషల్ కాన్సెప్ట్ తో వస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రమిది. ఈ చిత్రంలోని సీన్స్ కు మీరంతా కనెక్ట్ అవుతారు. మీ రియల్ లైఫ్ లో చూసినవి, విన్నవి, జరిగిన ఇన్సిడెంట్స్ మా సీఎం పెళ్లాం మూవీలో చూస్తారు. ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను మీ ముందుకు త్వరలో తీసుకొస్తున్నాం" అన్నారు.అజయ్ మాట్లాడుతూ" ఈ సాంగ్ చూశాక చాలా ఎమోషనల్ అయ్యాను. సీఎం పెళ్లాం చిత్రంలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ చేశారు. నేను సీఎంగా చేసినా సినిమా మొత్తం ఇంద్రజ గారే ఉంటారు" అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa