మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమైంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎపిక్ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఓ ప్రమోషన్ ఈవెంట్ లో నటుడు రఘుబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. వేదికపై మంచు విష్ణు, బ్రహ్మాజీ, రఘుబాబు కూర్చుని ఉండగా, ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను చెప్పేది వినండి అంటూ రఘుబాబు మైక్ అందుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడే చెబుతున్నా ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది 100 శాతం జరిగి తీరుతుంది. ఎవరైనా సరే ట్రోల్ చేశారంటే ఫినిష్ అంటూ సీరియస్ గా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa