ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రోమాంటిక్ స్టోరీతో వస్తున్న సంపూర్ణేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 08:20 PM

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 'సోదరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 11న ఇది విడుదల కాబోతుంది. ఇక అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో సంజోష్ కీలక పాత్ర పోషించగా.. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించాడు.ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే నాలుగు పాటలకు మంచి స్పందన లభించాయి. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది. తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ” సంపూర్ణేష్‌ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com