ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునర్నవి చిచ్చు.. వరుణ్ – వితిక ఫైట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2019, 11:30 AM

వితికకి  (Vithika Sheru) ఇచ్చిన వరుణ్‌.! (Varun Sandesh) అదేంటీ. హౌస్‌లో ఎవరికైనా షాక్‌ ఇవ్వాలంటే వీరిద్దరే (Punarnavi Vithika Bigg Fight) కదా ఇచ్చేది. అందులోనూ తన భార్యను ఏమైనా అంటే ముందూ వెనకా చూడకుండా, తప్పో, ఒప్పో కూడా పట్టించుకోకుండా హీరోయిజం ప్రదర్శిస్తూ, మీదకి దూస్కెళ్లిపోయే వరుణ్‌, వితికాకి షాకివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా.? వివరాల్లోకి వెళ్లిపోదాం.రోజుకో రకంగా క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తూ, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తోన్న బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 3) తాజా ఎపిసోడ్‌లో భాగంగా, నీరు, గ్యాస్‌ తదితర అంశాలు ప్రతీ మనిషికి ఎంత ముఖ్యమో వివరించి, వాటి విలువను గుర్తించి, పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ బిగ్‌బాస్‌ (Bigg Boss 3 Telugu) ఓ టాస్క్‌ ఇచ్చారు.


నీరు, గ్యాస్‌, హౌస్‌ యుటిలిటీస్‌కి సంబంధించి మూడు సైకిల్స్‌ని ఉంచారు. వీటిలో ఏది అవసరమైతే దానికి సంబంధించిన సైకిల్‌ని హౌస్‌ మేట్స్‌ తొక్కుతూ ఉండాలనీ, ఆపకుండా తొక్కుతూ ఉండాలని, ఒకవేళ ఆపితే, దానికి సంబంధించిన అంశం కట్‌ అవుతుందని సూచించారు.


ఈ టాస్క్‌లో భాగంగా అందరూ ఒకరి తర్వాత ఒకరు సైకిల్‌ తొక్కారు. మిగిలిన వారు కిచెన్‌ వర్క్‌, బాత్రూమ్‌ అవసరాలు గట్రా తీర్చుకున్నారు. ఇదంతా బాగానే నడుస్తోంది. అయితే, ఈ టాస్క్‌లో అందరూ పార్టిసిపేట్‌ చేశారు. కానీ, వితికా (Vithika Sheru) మాత్రం ఓన్లీ కిచెన్‌ వర్క్‌కే పరిమితమైంది. టాస్క్‌లో ఇన్‌వాల్వ్‌ కాలేదు.


దాంతో పునర్నవి (Punarnavi Bhupalam), ‘నువ్వు కూడా టాస్క్‌లో ఇన్‌వాల్వ్‌ కావచ్చు కదా..’ అని వితికకి సూచించింది. కానీ, ఆ మాట వితికాకి అంతగా రుచించలేదు. దాంతో డ్రామా ప్లే చేసింది. తనకు పొట్టలో అప్‌సెట్‌ అయ్యిందనీ, అయినా, కిచెన్‌లో తాను వర్క్‌ చేయకుంటే, సైకిల్‌ తొక్కేవాళ్లకి ఫుడ్‌ ఎలా వస్తుందనీ, ఫుడ్‌ లేకుంటే ఎనర్జీ ఎలా వస్తుందనీ ఆడ్డగోలుగా ప్రశ్నించింది.


ఈ విషయంలో వరుణ్‌, పునర్నవికి సపోర్ట్‌ చేశాడు. అవును నిజమే కదా.. నువ్వు కూడా టాస్క్‌లో ఇన్‌వాల్వ్‌ అవ్వాలి కదా.. పునర్నవి కరెక్ట్‌గానే చెప్పింది అంటూ చాలా క్యాజువల్‌గా చెప్పేశాడు. తన భర్త తనను లైట్‌ తీసుకుని, మరొకరికి సపోర్టింగ్‌గా మాట్లాడడం జీర్ణించుకోలేకపోయింది వితిక. వేరెవరినో ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడానికి, నన్నెలా తప్పు పడతావ్‌ అంటూ, భర్తపై అలిగింది. అలగడమే కాదు, ఏడ్చేసింది కూడా. ఆమెని దారికి తీసుకురావడం హౌస్‌ మేట్స్‌ వల్ల కాలేదు.చివరికి వరుణ్‌ వెళ్లి తన భార్యని కన్విన్స్‌ చేయడంతో ఎట్టకేలకు ఈ గొడవ (Punarnavi Vithika Bigg Fight) సద్దుమణిగింది. నిజానికి భార్యా భర్తల మధ్య జెలసీ కారణంగా ఇదంతా జరిగిందని అర్ధమవుతోంది. కానీ, తెలివిగా వితిక, భార్య భర్తల మధ్య పునర్నవి చిచ్చు పెట్టినట్లుగా ఆడియన్స్‌కి ఈ ఇష్యూని కన్‌వే చేసింది.


మరోవైపు రీసెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా (Tamanna Simhadri), శ్రీముఖికి (Sree Mukhi) అంత సీన్‌ లేదు అని తేల్చేసింది. తాను ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లుగా శ్రీముఖి గేమ్‌ ఆడడం లేదనీ తేల్చేసింది. తమన్నా మాటకి, జాఫర్‌, మహేష్‌ (Jaffar Mahesh Vitta)వంత పాడారు. మరో కంటెస్టెంట్‌ శివజ్యోతి (Siva Jyothi) కూడా టాస్క్‌ విషయమై, రీజన్‌లెస్‌గా కాసేపు విశ్వరూపం ప్రదర్శించింది. మిగిలిన వారంతా, తమ తమ స్టైల్‌లో పర్‌ఫామెన్స్‌ ఇచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa