తాజాగా విడుదలైన రామ్ చరణ్ కొత్త మూవీ 'పెద్ది' ఫస్ట్ లుక్‌పై చిరు కామెంట్ చేశారు. పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందని, ఈ చిత్రం తప్పకుండా సినీ అభిమానులకు ఒక మంచి ట్రీట్ కానుందని చిరంజీవి అన్నారు. పెద్ది చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. సినిమా ప్రియులకు, అభిమానులకు ఇది ఒక విందుగా ఉంటుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను" అని చిరు ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు విడుదలైన 'పెద్ది' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో చెర్రీ మరోసారి ఇంటెన్స్ లుక్‌తో అదరగొట్టారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
![]() |
![]() |