మంచు విష్ణు కథానాయకుడిగా 'కన్నప్ప' సినిమా రూపొందింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో మంచు విష్ణు బిజీగా ఉన్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు. 'కన్నప్ప' కథను మరోసారి ప్రపంచానికి చెప్పడానికి ఆ శివుడు నన్ను ఎంచుకున్నాడని నేను భావిస్తున్నాను. లేకపోతే ఇంతమంది స్టార్స్ తో నేను ఈ సినిమా చేయడం ఏమిటి? అని అన్నాడు. 'భక్త కన్నప్ప' సినిమాలో రావు గోపాలరావు గారు చేసిన పాత్రను ఈ సినిమాలో నాన్నగారు చేశారు. అయితే ఆ పాత్ర తీరుతెన్నులను మార్చడం జరిగింది. అలాగే 'కన్నప్ప' గురించి ఇంతవరకూ ప్రపంచానికి తెలిసిన విషయాలను అలాగే ఉంచి, మిగతా విషయాలను ఊహించి తయారు చేసుకోవడం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పరుచూరి గోపాలకృష్ణ గారు ఎంతగానో సహకరించారు. ఈ కథకి అవసరమైన లొకేషన్స్ దొరకడం కూడా ఆ శివయ్య అనుగ్రహమేనని అనుకుంటున్నాను" అని చెప్పాడు. " ఇక ఈ సినిమాను ప్రభాస్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అంటున్నారు. ఈ కథను తనకి చేయాలని ఉందని ప్రభాస్ ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ఈ సినిమా చేయాలని ఉందని నాతో ప్రభాస్ అంటే, నేను ఈ కథ జోలికి వెళ్లే వాడిని కాదు. కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే, ఆయనతో ఈ ప్రాజెక్టును గురించి మాట్లాడి .. ఆయన ఆశీస్సులను అందుకోవడం జరిగింది. ఈ సినిమాలో శ్రీకాళహస్తిలో శివలింగం ఎలా ఉంటుందో అలాగే చూపించగలిగాననే ఒక సంతృప్తి నాకు ఉంది" అని అన్నాడు.
![]() |
![]() |