ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి నాయికి పాత్రలో నమిత

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2019, 02:30 PM

నటి నమిత కొంత విరామం తర్వాత మళ్లి తెలుగు సినిమాలో నటించనున్నట్టు తెలిసింది. దక్షిణాదిలో కొన్ని సినిమాలే చేసినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో ‘సొంతం’ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెంకటేష్‌ జెమిని సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత బాలకృష్ణతో ‘సింహా’లో నటించింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సింహా తర్వాత నమిత వివాహం చేసుకుని సెటిలైంది. ఇప్పుడు ఆమెకు మళ్లిd బాలకృష్ణ చిత్ర యూనిట్‌ నుండి పిలుపు వచ్చినట్టు తెలిసింది. బాలకృష్ణ, కె.ఎస్‌. రవికుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రకి నమితను ఎంపికచేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రని అంటున్నారు. సింహా తర్వాత బాలకృష్ణ, నమిత మళ్లిd కలిసి నటించనుంది ఈ సినిమాలోనే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa