అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" సినిమాను దిల్‌రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్‌ప్రైజ్‌ను మహేష్ సిద్ధం చేస్తున్నాడట. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఓ మైక్రో టీజర్‌తో పాటు మహేష్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa