ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే : సంపూర్ణేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2019, 06:30 PM

'హృదయకాలయం' సినిమాతో తెలుగు తెరపై గుర్తింపు తెచ్చుకున్న సంపూరేష్ బాబు 'కొబ్బరిమట్ట' సినిమాతో ప్రేక్షకులను మరోసారి నవ్విచేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాలో ఆయన ఏకధాటిగా 3 నిమిషాలపాటు చెప్పిన డైలాగ్ గురించి ఆయన మాట్లాడుతూ...  "ఈ సినిమాలో 3 నిమిషాల పాటు ఆపకుండా నేను చెప్పవలసిన డైలాగ్స్ గురించి దర్శకుడు నాతో ప్రస్తావించాడు. ఒక రోజున నాకు 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ యమధర్మరాజుగా చెప్పిన డైలాగ్స్ ను చూపించాడు. ఎన్టీఆర్ ఆ డైలాగ్స్ ను ఎంత ఎనర్జీతో చెప్పారో అలా చెప్పాలని అన్నాడు. ఎన్టీఆర్ మాదిరిగా ఎంత ఎనర్జీతో ఆ డైలాగ్స్ ను చెప్పడం మొదలుపెడతావో, అంతే ఎనర్జీతో పూర్తిచేయాలని చెప్పాడు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకునే ఆ డైలాగ్ చెప్పాను. అందుకోసం నేను గట్టి కసరత్తు చేయవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa