రోజూ గొడవలతో అరుపులతో నిండి ఉండే బిగ్‌బాస్ హౌస్.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో మాత్రం కంటతడిపెట్టించింది. అందరూ తమ జీవితంలో జరిగిన చేదు ఘటనల గురించి చెప్పుకుంటూ కంటనీరు పెట్టుకున్నారు. ఇక హౌస్‌మేట్స్ అందరూ ఎమోషనల్ అవడం.. ఈ ఒక్కరోజు ఎలాంటి గొడవలు జరగకపోవడంతో బిగ్‌బాస్ ఇళ్లు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది. ఇక నిన్నటి కెప్టెన్సీ టాస్క్‌లో.. వరుణ్‌కు మద్దతు తెలిపినందుకు గల కారణాలను రవికృష్ణ, హిమజలు శ్రీముఖి, అలీరెజాలతో చెప్పుకొచ్చారు. ఎలిమినేషన్‌లో ఉన్నందుకు వరుణ్‌కు ఉపయోగపడుతుందని, కెప్టెన్సీలో ఉంటేనే వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుందని అందుకే వరుణ్‌కు ఓటు వేశానని రవికృష్ణ, అదే కారణంతోనూ తనకు ఓటు వేశానని హిమజ పేర్కొంది.
అలీ రెజా, తమన్నాలు తమ మధ్య జరిగిన గొడవ గురించి చర్చించుకున్నారు. కావాలని తాను అలా చేయలేదని, ఫన్ క్రియేట్ చేసేందుకు అలా చేశానని తమాన్నాతో చెప్పుకొచ్చాడు అలీ రెజా. అనంతరం లగ్జరీ బడ్జెట్ గురించి బట్టలుతికే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా ట్రిపుల్ ఎక్స్ సోప్‌ను వాడుకున్నారు. ఆ సోప్‌లో బంగారు నాణెలు వెళితే వంద పాయింట్లు, వెండినాణెలు వెళితే యాభై పాయింట్లు వస్తాయని పేర్కొనగా.. మొత్తంగా 3350 పాయింట్లను గెలుచుకున్నారు. ఈ ఇక లగ్జరీ బడ్జెట్‌లో ఎండ్ బజర్ మోగాక కూడా.. కాఫీలో మార్పులు చేర్పులు చేశారని ఇంటి సభ్యులపై ఆగ్రహించిన బిగ్‌బాస్.. ఆ ప్రొడక్ట్‌ను తప్పా మిగిలిన వాటన్నింటిని పంపిస్తామని.. మరోసారి అలాంటి తప్పు జరిగితే మొత్తం లగ్జరీ బడ్జెట్‌ను రద్దు చేస్తానని హెచ్చరించాడు.
అనంతరం లివింగ్ ఏరియాలో పునర్నవి, రాహుల్, వరుణ్ సందేశ్‌లు వ్యక్తిగత విషయాలను ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. డేటింగ్ విషయంలో పునర్నవి, రాహుల్ సరదాగా కామెంట్స్ చేసుకున్నారు. చిన్నపిల్లల టాస్క్‌లో ఇంటిసభ్యులందరూ బాల్యంలోకి వెళ్లారని, ఇక ప్రస్తుతం తమ జీవితంలో బాధపడ్డ, జరగకూడని సంఘటనల గురించి చెప్పుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. మొదటగా వచ్చిన అలీరెజా.. తన మూలాన తన భార్య యాక్సిడెంట్‌లో గాయపడటంపై క్షమాపణ కోరాడు. తన ఇంట్లో ప్రేమ వ్యవహారం మూలాన వచ్చిన సమస్యలను జాఫర్ తెలిపాడు. తన జీవితంలో జరిగిన ఓ యాక్సిడెంట్ గురించి రోహిణి చెప్పుకొచ్చింది. రవికృష్ణ, బాబా భాస్కర్ తమ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తన తాత గురించి చెప్పుకుంటూ శ్రీముఖి కంటతడిపెట్టింది. అంతవరకు అందరూ ఏడిపించగా.. తాను మాత్రం పాజిటివ్‌గా చెబుతానని తన పేరెంట్స్ గురించి హిమజ చెప్పుకొచ్చింది.
తన ప్రేమ గురించి చెప్పుకుంటూ తన భర్త గురించి వివరించింది శివజ్యోతి. రాహుల్ తన కెరీర్, తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పి హౌస్‌లో నవ్వులు పూయించాడు. పునర్నవి.. తన రిలేషన్ షిప్ గురించి చెప్పుకుంటూ అతని చావుకు తన మొండితనమే కారణమని, మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదంటూ చెప్పుకొచ్చింది. తనకు ఎంతో సహాయపడిన పిన్నిని పట్టించుకోలేదని వితికా చెప్పుకుంటూ కన్నీరుపెట్టింది. తన పేరెంట్స్‌ను తిట్టానని, తన వద్ద ఉండొద్దన్నానని అన్నట్లు వరుణ్ సందేశ్ వివరించాడు. అయితే వారు యూఎస్ వెళ్లాక.. తన నుంచి దూరమయ్యాక వారి విలువ తెలిసిందంటూ ఆ టైమ్‌లో వితికా పరిచయమైందంటూ చెప్పుకొచ్చాడు.
ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి రెండో వ్యక్తి బయటకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. మరి రాహుల్, జాఫర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షెరు, మషేష్ విట్టా, పునర్నవి భూపాలం, హిమజలలో ఎవరు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa