ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా "ఆర్ ఆర్ ఆర్ " చిత్ర బృందం ఓ పోస్టర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ పంచుకుంటూ.. ‘అద్భుతమైన స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది. రామరాజు,భీంల స్నేహం మాదిరిగా.. మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఎవరు? ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి’’ అని పేర్కొంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa