అమెరికాకు చెందిన ఓ బిజినెస్ మేన్ కూతుర్ని ప్రభాస్ పెళ్లాడతాడంటూ సరికొత్త ప్రచారం షురూ అయింది. అమ్మాయి పేరుతో పాటు ఇతర విషయాలు మాత్రం బయటకు రాలేదు. కాకపోతే ఆ బిజినెస్ మేన్ కు మాత్రం భీమవరం మూలాలు ఉన్నాయని టాక్.
తాజాగా వినిపిస్తున్నఈ ఎన్నారై సంబంధం విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ప్రభాస్ మరో 2 నెలలు గడిస్తే ఏకంగా 40వ వడిలోకి ఎంటరై పెళ్లీడు కూడా దాటిపోతోందనేడి వాత్సవం. .
గతంలో కూడా ప్రభాస్ పెళ్లిపై ఇలాంటి పుకార్లు చాలా వచ్చాయి. స్వయంగా కృష్ణంరాజు అప్పట్లో కొన్ని హింట్స్ ఇచ్చారు. కానీ ఆ సంబంధాలేవీ వర్కవుట్ కాలేదు.
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇకనైనా ప్రభాస్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలనేది తెలుగు ప్రేక్షకుల ఆశ.మరి ప్రస్తుతం వినిపిస్తున్న ఎన్నారై సంబంధంపై ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు రియాక్ట్ అవుతారనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa