బిగ్ బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి తన చేష్టలతో ఇంటి సభ్యుల సహనాన్ని పరీక్షిస్తుంది. కొద్ది రోజుల క్రితం అలీరాజాపై వ్యక్తిగత దూషణలు చేసిన తమన్నా ఇప్పుడు రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివ జ్యోతిలని టార్గెట్ చేసి నీచంగా మాట్లాడుతుంది. రోజు రోజుకి వారి సహనాన్ని పరీక్షిస్తూ నెటిజన్స్ దృష్టిలోను బ్యాడ్ అవుతుంది. నేనింతే .. టార్గెట్ చేస్తే ఇలానే ఉంటుంది. నువ్వు మగాడివా కాదా అంటూ అసభ్యపదజాలంతో తమన్నా హౌజ్‌లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మిగతా ఇంటి సభ్యులు ఆమెకి ఎంత నచ్చ చెప్పిన కూడా తను ఏం చేయాలనుకుంటుందో అదే చేసి చూపిస్తుంది.
మంగళవారం రోజు రవికృష్ణని పప్పుగాడు అంటూ పర్సనల్ టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి ఏవోవో మాటలు మాట్లాడుతూ రవికృష్ణ సహనాన్ని పరీక్షించింది. నమ్మినోళ్ళకి వెన్ను పోటు పొడుస్తావా.. ఇక సారీలు ఉండవు అన్ని ఎటాక్‌లే అంటూ తమన్నా వాపోయింది. ఆ మధ్యలో శివజ్యోతిపై కూడా నోరు పారేసుకుంది. శివ జ్యోతి జర్నలిజంకి సరిపోదని, ఆమె డబ్బు కోసం చేసే నటన ఇది అని అనడంతో శివజ్యోతి ధీటుగా స్పందించింది. నోటికొచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ వివాదం ముగిసిన తర్వాత మళ్ళీ రవికృష్ణని టార్గెట్ చేస్తూ ఆయన నవ్వులో కూడా దమ్ములేదు .. నువ్ మగాడికి కాదు.. రేయ్ పప్పూ అంటూ రెచ్చగొట్టింది.
తనకి ఒక వ్యక్తితో ప్రాబ్లమ్ అని ముందు చెప్పిన తమన్నా.. రోహిణి, అలీ రాజా, రాహుల్ సిప్లిగంజ్‌తో కూడా గొడవపడుతూనే ఉంది. తప్పుడు మెసేజ్‌లు ఇస్తున్నావంటూ రాహుల్‌పై ఫైర్ అయింది. కొడతావా రా అంటూ అతనని రెచ్చగొట్టింది. ట్రాన్స్ జెండర్స్ తరపున వచ్చి వాళ్లకు స్పూర్తిగా నిలవాల్సిన మీరు ఇలా దిగజారుడుగా ప్రవర్తించడం సరికాదంటూ చురకలేసే ప్రయత్నం చేశారు రాహుల్ సిప్లిగంజ్. కన్ఫెషన్ రూంలో తమన్నా ప్రవర్తన గురించి శ్రీముఖి, రవికృష్ణ బిగ్ బాస్ తెలియజేశారు. ఆమె చాలా హద్దుమీరుతుందని , ఆమె ప్రవర్తించే తీరు ఎవరికి నచ్చడం లేదని వారు వాపోయారు.
తమన్నా హంగామా హౌజ్‌లో కొనసాగుతూ ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఓ టాస్క్ ఇచ్చారు. దొంగలున్నారు జాగ్రత్త అనే కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా తికమకపురంలో ఊరి పెద్దగా వరుణ్ సందేశ్,తమన్నాలు ఉంటారని .. ఊరిలో ఓ జంట అలీ , పునర్నవి.. అన్నదమ్ములు రాహుల్ ,మహేష్.. అక్క చెల్లెళ్లు రోహిణి, వితిక పని కోసం ఎదురు చూసే లాయర్‌గా హిమజగా ఉంటారు. బద్దకస్తుడైన పోలీస్ ఆఫీసర్ బాబా భాస్కర్.. స్ట్రిక్ట్ కానిస్టేబుల్‌గా శివజ్యోతి . ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని జైల్లో వేయాలని తెలిపాడు.
టాస్క్‌లో భాగంగా ఊరికి సంబంధించిన నిధిలో ఉన్న వస్తువులను, డబ్బును దొంగతనం చేయడమే దొంగల టార్గెట్ అని బిగ్ బాస్ చెప్పడంతో ముగ్గురు దొంగలు దొంగిలించే పనిలో పడ్డారు. వాటిని కాపాడే పనిలో మిగతా ఇంటి సభ్యులు ఉన్నారు. అయితే శ్రీముఖి తప్పు చేసిందని అరెస్ట్ చేసేందుకు సావిత్రి, బాబా భాస్కర్ సిద్ధం కాగా ఆమెకి కొంత మొత్తం ఇచ్చి జైలులోకి వెళ్లకుండా జాగ్రత్త పడింది. టాస్క్ మధ్యలోనే 17వ ఎపిసోడ్‌కి బ్రేక్ పడింది. ఈ రోజు దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ మిగతా బాగం ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలో వరుణ్ సందేశ్ దగ్గర శ్రీముఖి తన చలాకీతనంతో డబ్బులు కొట్టేసినట్టు చూపించడంతో పాటు ఎవరో నిధి ఉన్న బాక్స్ అద్దాలు పగలగొట్టినట్టు కూడా చూపించారు. నేటి ఎపిసోడ్‌లో ఇంటికి రెండో కెప్టెన్‌గా ఎవరు ఎంపిక కానున్నారో తెలియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa