అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాగానే ఆడాయి. తాజాగా ఈ కాంబినేషన్ లో తండ్రీకొడుకుల కథతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు 'నాన్న నేను' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
ఐటీ ఈ సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో త్రివిక్రమ్ బన్నీల నడుమ విభేదాలొచ్చాయని ఫిలిం నగర్ టాక్. ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా ఓ ఐటెం సాంగ్ పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తుంటే, గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన
సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లేవు. కాబట్టి ఈ సినిమాలో కూడా వద్దని అల్లు అర్జున్ అంటున్నాడట. ఈ విషయం లోనే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని, ఓ వైపు షూటింగ్ జరుగుతున్నా ఇరువురు ఎడముఖం పేద ముఖంగానే ఎవరి పని వారు చేసుకుని సెట్ నుంచి వెళ్ళిపోతున్నారట