రోజు వారి ఖర్చులు కూడా తీర్చుకోలేని స్థితికి తాను దిగజారి పోయానని, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి తన సినీ ప్రయాణంలో చూశానని బాలీ వుడ్ భామ పరిణితి చెప్పింది. ఈ మధ్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన నట జీవనము పై అనేక కబుర్లు చెప్పింది తాజాగా బాలీవుడ్ నటి, ప్రియాంక చోప్రా సోదరి పరిణితి చోప్రా
2014, 2015 సంవత్సరాల లో త తాను నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో ఆర్ధిక కష్టాలు వెంటాడాయని, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఒంటరిగా గడిపేదాన్నని, ఇక తన పని అయిపోయింది అనుకున్నానంటూ అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకుంది ఈ భామా మణి . ఆ సమయంలో స్నేహితుల సపోర్ట్ లభించిందని, వారి సహకారంతోనే తను కోలుకున్నట్టుగా పరిణితి తెలిపింది.