బాలీవుడ్ దర్శకధీరుడు జె ఓం ప్రకాశ్ తుదిశ్వాస విడిచారు. మా అంకుల్ 93 ఏళ్ల జె ఓం ప్రకాశ్ ముంబయిలోని తన నివాస గృహంలో ఎనిమిది గంటలకు చనిపోయాడని యాక్టర్ దీపక్ పరేషర్ తన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. బాలీవుడ్‌లో ఆప్‌కి కశమ్, ఆఖిర్ క్యోన్, అప్నాపామ్, ఆశా, అప్నాబానాలో, అర్పన్ ఆద్మీ ఖైలోనా హాయ్ సినిమాలకు దర్శకత్వం వహించగా ఆయే దిన్ బహర్ కీ, ఆయ్ శవాన్ ఝుమ్‌కీ, అంఖన్ అంఖన్ మేన్ హిట్ సినిమాలకు నిర్మాతగా పని చేసైనా ప్రకాష్ , బాలివుడ్ హీరో హృతిక్ రోషన్ కు తాత, తన తాత మరణంపై హృతిక్ స్పందిస్తూ తాత సహాయం లేకుంటే తనకు జీవితం లేదని, మా తాతను ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు. ఓం ప్రకాశ్ మృతి బాలీవుడ్ కు తీరని లోటని బాలీవుడ్ సంతాపం ప్రకటించింది.