ప్రస్తుత నటీమణులకు యోగానో.. వెయిట్ ట్రైనింగో.. ఏరోబిక్సో.. జుంబా డ్యాన్సో.. ఏదో ఒకటి తప్పకుండా చేయడం అలవాటుగా మారింది. అయితే ఈమధ్య మరో ట్రెండ్ కూడా మొదలైంది. అదే బెల్లీ డ్యాన్స్.. ఈ పాపలందరూ ‘నాకు బెల్లీ డ్యాన్స్ అంటే ఇష్టం అంటున్నారు. శ్రీదేవి డాటర్ జాహ్నవి కపూర్.. అనన్య పాండే.. షారూఖ్ డాటర్ సుహానా లాంటివారు బెల్లీ డ్యాన్స్ లో మెళకువలు నేర్చుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే చేంతాడంత అవుతుంది. ఈ లిస్టులో తాజాగా బ్యూటిఫుల్ రకుల్ కూడా జాయిన్ అయింది. రకుల్ ప్రస్తుతం హిందీ లో ‘మర్జావా’ అనే చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా.. రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్. ఈ సినిమాలో ఒక పాట కోసం బెల్లీ డ్యాన్సింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టిందట. అంతే కాదు తను రెగ్యులర్ గా చేసే ఎక్సర్ సైజులకు లిస్టులో ఇది మరో ఎక్సర్ సైజ్ అని చెప్పుకొచ్చింది. ఫ్లాట్ యాబ్స్.. బెటర్ డ్యాన్సింగ్ స్కిల్స్ కోసం ఈ బెల్లీ డ్యాన్స్ ను ఇకపై కంటిన్యూ చేస్తానని చెప్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa