ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ‘హిట్‌ 3’ టికెట్‌ ధరల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 12:41 PM

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 3’ టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.50 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పించింది. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇక ప్రస్తుతం ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు రూ.110 నుంచి రూ.145 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.177 వరకు ఉన్నాయి. అయితే, హిట్ 3 వంటి భారీ అంచనాలున్న చిత్రాల కోసం ధరలను రూ.50 నుంచి రూ.75 వరకు పెంచితే, థియేటర్ యజమానులు, నిర్మాతలు ఆర్థికంగా లాభపడతారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa