సిల్వర్ స్క్రీన్పై హిట్ అండ్ క్రేజీ పెయిర్ ఎవరంటే?.. మనకు ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్, అనుష్క జోడీ. ‘స్పిరిట్’ మూవీపై క్రేజీ బజ్. వీరిద్దరూ నటించిన 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టాయి.వీరి జోడీ ఎవర్ గ్రీన్ అని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. వీరి జోష్ పెంచేలా మరో క్రేజీ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో అనుష్క నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'స్పిరిట్'మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచీ క్రేజీ బజ్ నెలకొంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అటు డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.అయితే.. మూవీలో స్పెషల్ రోల్ కోసం సందీప్ భారీగానే ప్లాన్ చేస్తున్నారట. సెకండాఫ్లో వచ్చే కీలక రోల్ మూవీకే హైలెట్ అని.. దీనికి అనుష్క అయితేనే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతున్న మూవీలో స్టోరీకి అనుగుణంగా వచ్చే ఈ రోల్ డిఫరెంట్గా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే ప్రభాస్, అనుష్క.. బిల్లా, మిర్చి, బాహుబలి 1, 2 సినిమాల్లో నటించారు. అప్పట్లో వీరిద్దరి పెళ్లిపై కూడా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. మరోసారి మూవీలో జోడీ కట్టనున్నారనే వార్తలతో డార్లింగ్ ఫ్యాన్స్తో మూవీ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పిరిట్' ప్లాన్ చేశారు. ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన ఛార్మింగ్ లేడీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే కూడా యాక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. త్రిష, నయనతార, కియారా అడ్వానీ పేర్లు కూడా సందీప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరిని తీసుకుంటారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు.. బాలీవుడ్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్లను కూడా సందీప్ ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ మూవీలో నెగిటివ్ రోల్లో కనిపించనున్నారనేలా వార్తలు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.'స్పిరిట్' ఆలస్యం అవుతుందన్న రూమర్లకు చెక్ పెడుతూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత భూషణ్ కుమార్ కీలక అప్ డేట్ ఇచ్చారు. 2, 3 నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని.. 2027లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సందీప్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. ఆయన డైరెక్షన్లో వచ్చిన 'యానిమల్'కి సీక్వెల్గా 'యానిమల్ పార్క్' తెరకెక్కనుంది. అయితే, ఈ మూవీ తర్వాతే ప్రభాస్ 'స్పిరిట్' వస్తుందని.. మరింత ఆలస్యం తప్పదని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa