గత సంవత్సరం అనామకంగా వచ్చి మంచి విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘హార్ట్‌బీట్’ . తమిళం నుంచి డబ్ అయిన ఈ సిరీస్ తెలుగు వారిని కూడా బాగా ఆలరించింది. తొలి సీజన్ ఉత్కంఠభరితమైన మలుపులతో ముగిసినప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో అలానే ఉంచారు. వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ‘హార్ట్‌బీట్-2’ సీజన్ విడుదల చేసేందుకు మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో మొదటి భాగంలో మిస్సయిన వాటికి క్లారిటీ ఇస్తూ అనేక కీలమైన టర్నింగ్ పాయింట్స్, ఉత్కంఠభరిత, భావోద్వేగ సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ విషయం తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.నిలోఫర్, కిరణ్, కమల్, రోషిణి, డీఎం కార్తిక్, బాలు, అనుమోల్, యోగలక్ష్మి, పాటినికుమార్, శర్వా, శబరీష్, చారుకేష్, రేయా ప్రధాన పాత్రలు పోషించిన ఈ ‘హార్ట్‌బీట్ సీజన్2’ వెబ్ సిరీస్ ఈ నెలాఖరు నుంచి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సీజన్ తెలుగు ప్రోమో రిలీజ్ చేశారు. రెండో సీజన్‌కు సుందరరాజన్ కథను సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించగా, జిమల్ సూర్య థామస్ సినిమాటోగ్రఫీ అందించగా, శరణ్ రాఘవన్ సంగీతం సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa