ముంబై మహా నగరానికి మరో మణిహారం రాబోతోంది. ఇప్పటికే ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన ఈ మహానగరంలో అతి పెద్ద స్డూడియో నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఫిల్మ్ సిటీ నిర్మించాలని డిఎన్ఇజీ - ప్రైమ్ ఫోకస్ కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 3000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. డిఎన్ఇజి కంపెనీ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది చివరిలోనే భూమి పూజా చేయనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa