రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటించిన 'రైడ్ 2' చిత్రం మే 1, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలతో బాక్స్ఆఫీస్ వద్ద ప్రారంభమైంది. ఇది 2018 హిట్‌కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. ఈ చిత్రంలో నటుడు ఫియర్లెస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అమాయ్ పాట్నాయక్ గా కనిపించనున్నాడు.తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా విడుదలైన 9 రోజులలో ఇండియా వైడ్ గా 103.9 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వాని కపూర్, రాజత్ కపూర్, సౌరభ్ శుక్లా కూడా నటించారు, మరియు తమన్నా భాటియా ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. పనోరమా స్టూడియోస్ మరియు టి-సిరీస్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa