'ఫైనల్ డెస్టినేషన్' ఫస్ట్ ఫ్రాంచేజ్ మూవీ 2000 సంవత్సరంలో వచ్చింది. హఠాత్తుగా జరిగే ఊహకందని హత్యల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఆ హారర్ మూవీ ప్రేక్షకులను విభ్రమకు గురిచేసింది. దాంతో దానికి కొనసాగింపుగా ఆ ఫ్రాంచైజ్ లోనే మరో నాలుగు సినిమాలు వరుగా 2003, 2006, 2009, 2011లో వచ్చాయి. ఇవి కూడా ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. 'ఫైనల్ డెస్టినేషన్' తరహాలో హారర్, థ్రిల్లర్ మూవీస్ చాలానే గడిచిన కొన్నేళ్ళుగా వస్తున్నా, వరల్డ్ వైడ్ ఈ ఫ్రాంచైజ్ కు అభిమానులు బాగానే ఉన్నారు. అందుకే మళ్ళీ పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి దీని ఫ్రాంచైజ్ గా 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' మూవీ రాబోతోంది. మే 15వ తేదీన ఈ సినిమా ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కు సిద్థమైంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ను చూస్తే... ముందు వచ్చిన ఐదు చిత్రాలకంటే ఇందులో వయొలెన్స్, హారర్, థ్రిలింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయనేది అర్థమౌతోంది. తాజాగా విడుదల కాబోతున్న 'ఫైనల్ డెస్టినేషన్ : బ్లడ్ లైన్స్' అనేది ఈ ఫ్రాంచైజ్ లో చివరి చిత్రం. సో... ఈ ఆరవ చిత్రంతో దీనికి మేకర్స్ ముగింపు పలుకబోతున్నారు. అయితే... ఈ హారర్ మూవీకి ప్రీమియర్ షోస్ వేయడానికి ఇండియాలోని పంపిణీదారులు సిద్ధమౌతున్నారు. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ను ముందు రోజు రాత్రి 11:59కి మొదలు పెట్టబోతున్నారట. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ ప్రీమియర్స్ ఉంటాయని అంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ పడతాయని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa