జామురాతిరి జాబిలమ్మా..’ ఈ పాట వినగానే మనకు గుర్తొచ్చే చిత్రం ‘క్షణ క్షణం’. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వెంకటేశ్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ఇందులోని పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘జామురాతిరి జాబిలమ్మా..’ పాట ఎప్పుడు విన్నా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి చక్కని పాటను యువ గాయకులు మరోసారి తమదైన శైలిలో ఆలపించి ఆకట్టుకున్నారు. గాయకులు హేమచంద్ర, కాలభైరవ, మనీష, దీపూ, దామిని, మౌనిమ, శ్రుతి, నోయల్, పృథ్వీ చంద్రలు ఈ పాటను ఆలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa