ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖతర్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్‌నేషనల్ మూవీ అవార్డ్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2019, 09:08 PM
ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్‌ నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం ఈసారి ఖతర్‌లోని దోహలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సందీప్ వంగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కేజీఎఫ్ స్టార్ యష్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినీ సెలబ్రిటీలకు గురువారం, శుక్రవారం అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ మెగాస్టార్ మోహల్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరుకాను న్నారు. ఇద్దరు మెగాహీరోలు పాల్గొంటుండటంతో ఈకార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.  





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa