మొన్న మేకింగ్ వీడియోతో సంచలనం రేపిన సైరా ఇంకో నాలుగు రోజుల్లో టీజర్ తో సందడి చేయనుంది. చిరంజీవి 151వ చిత్రమైన 'సైరా'లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాగమయ్యారు. చిరంజీవి పక్కన కూర్చుని ఉండగా, ఆవేశంతో పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్న దృశ్యాలను సినిమా ప్రమోషన్ సంస్థ శ్రేయాస్ మీడియా విడుదల చేసింది. ట్విట్టర్ లో విడుదలైన ఈ చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమాలో పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. "సైరా... నరసింహారెడ్డికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది మెగా ఫ్యాన్స్ కు విందే. ఆయన మాటలు వినడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారు?" అని శ్రేయాస్ మీడియా క్యాప్షన్ పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa