మలయాళంలో చాలా తక్కువ ఖర్చులో , తక్కువ పాత్రలతో , తక్కువ లొకేషన్స్ లో బలమైన కథను చెప్పడంలో అక్కడి దర్శకులు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో 'వడక్కన్' ఒకటిగా కనిపిస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. కిశోర్ - శృతి మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సాజీద్ దర్శకత్వం వహించాడు. రసూల్ పూకుట్టి ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa