టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల 'డాకు మహారాజ్' లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. సంక్రాంతి సీజన్లో విడుదలైన ఈ చిత్రం విజయవంతమైన వెంచర్‌గా మారింది. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ గోల్డ్ ఛానల్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 8న రాత్రి 8 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, చాంధిని చౌదరి, సత్య, ఊర్వశి రౌటేలా, సత్య మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa