తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌కు 'భైరవం' పేరుతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నారా రోహిత్ యొక్క థీమ్ అఫ్ వరద వీడియోని రేపు సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 30న విడుదలకి సిద్ధంగా ఉంది. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa