ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా "సీతా పయనం"అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాలో నిరంజన్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. కన్నడలో ప్రాథమికంగా చిత్రీకరించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో నిరంజన్ కి జోడిగా ఐశ్వర్య అర్జున్ నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని మే 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో సత్య రాజ్, ప్రకాష్ రాజ్, ధృవ్ సర్జ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా మ్యాన్ గా బలమురుగన్, ఎడిటర్ గా అయూబ్ ఖాన్, రైటర్ గా సాయి మాధవ్, చంద్ర బోస్ ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ సర్జా తన శ్రీ రామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాల్ని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa